Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులు శుభవార్త వింటారని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులు శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 18 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులు శుభవార్త వింటారని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులు శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 18 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఈరోజు బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభం..

ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు అందు తాయి.

మిథునం..

శుభ గ్రహాలు చాలావరకు అనుకూలంగా మారాయి. ఫలితంగా, ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. సతీమణికి ఉద్యోగపరంగా మంచి అభి వృద్ధి ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కర్కాటకం..

ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది. హద్దులు దాటిన ఔదార్యంతో మిత్రులకు సాయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం..

ప్రస్తుతం భాగ్య స్థానం బలంగా ఉన్నందువల్ల ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమైపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు ఎదురుండదు. సతీమణి ఉద్యోగపరంగా రాణిస్తారు. బంధు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య..

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అవనసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల..

తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం..

వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాస లతో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

ధనస్సు..

ప్రయ త్నాలు, నిర్ణయాలు, ఆలోచనలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుం డదు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం..

వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం, బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం అనుకూలి స్తుంది.

కుంభం..

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ఉత్సాహంగా, అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగి పోతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

మీనం..

ఒకటి, రెండు శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల తీరును మార్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.