Bhuvanagiri: కోర్టు సంచలన తీర్పు.. హత్య చేసినట్లు ఒప్పుకున్నా.. నిర్దోషిగా విడుదల
Bhuvanagiri: భువనగిరి జిల్లా కోర్డు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. 2017లో అంబోజు నరేశ్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
2017 మే నెలలో నరేష్ అనే యువకుడు పరువు హత్యకు గురయ్యాడు.
ఈ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.
ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని.. న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేశారు.
దీంతో నిందితుల విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
ఈ తీర్పుపై హత్యకు గురైన నరేష్ తండ్రి అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలిపారు.
తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆవేదన చెందారు.
హత్యకు కారణం ఇదే?
యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన నరేష్.. లింగరాజుపల్లికి చెందిన స్వాతి ప్రేమించుకున్నారు.
కులాలు వేరు కావడంతో యువతి ఇంట్లో అంగీకరించలేదు.
దీంతో నరేష్ స్వాతిని ముంబై తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
విషయం తెలిసిన యువతి బంధువులు.. వారిని నమ్మించి యాదాద్రికి రప్పించారు.
నరేష్ స్వాతి ఇక్కడికి వచ్చాక స్వాతి తండ్రి అసలు స్వరుపాన్ని బయటపెట్టాడు.
రెండు రోజుల వ్యవధిలోనే నరేశ్ ఘోర హత్యకు గురయ్యాడు.
ఈ హత్యకు కారణం యువతి తండ్రేనని పోలీసులు విచారించారు.
నరేష్ హత్యకు గురైన కొద్ది రోజుల్లోనే స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వీరి ప్రేమ విషాదాంతమైంది.
తమ కొడుకు జాడ తెలియడం లేదంటూ.. బాధితుడి తల్లిదండ్రులు కోర్డులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
నరేష్ ను కోర్టులో హాజరు పరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
దీనిపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు.. స్వాతి తండ్రే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
బంధువు సాయంతో నరేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దారుణంగా హత్య చేసి దహనం చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇక స్వాతి మృతి కేసులోనూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
సాక్ష్యాలు లేవని కొట్టేసిన కోర్టు..
నరేశ్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా స్వాతి తండ్రి.. ఏ2గా సమీప బంధువు సత్తిరెడ్డి ఉన్నారు.
పోలీసుల విచారణలో చేసిన నేరం ఒప్పుకున్నారు.
కానీ న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు పూర్తవడంతో నిందితులు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది.
23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు.
అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/