Fire accident in Hyderabad: వరుస అగ్ని ప్రమాదాలు.. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది?
Fire accident in Hyderabad: సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నగరంలో అలజడి రేపింది. ఉదయం అంటుకున్న సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆరంతస్తుల భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో.. సమీప ప్రాంతాల్లో భయం నెలకొంది.
ఈ భవనంలో వ్యాపార సముదాయాలు.. పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఫైరింజన్లు వచ్చినా.. మంటలు అదుపుకాలేదంటే పరిస్థి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మంటలను అదుపుచేసే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది.. అస్వస్థతకు గురయ్యాయరు. ప్రస్తుతం ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా.. నగరంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నల్లగుట్ట ప్రాంతంలో ఉన్న డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ దుకాణంలో మెుదట ఈ మంటలు చెలరేగాయి.
భవనం సెల్లార్‌లో కార్ల విడిభాగాలకు సంబంధించిన గోదాం ఉంది.
గ్రౌండ్ ఫ్లోర్‌లో వస్త్ర దుకాణం ఉండగా.. మొదటి అంతస్తులో క్రీడా సామగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు.
మిగతా మూడంతస్తుల్లో పలు రకాల వస్తువులను నిల్వ ఉంచారు. ఒక్కసారిగా సెల్లార్‌లోని కార్ల విడిభాగాల
గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అలముకున్న పొగ.. మంటలతో ప్రజలు పరుగులు తీశారు.
ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే.. సాయంత్రం 6గంటలు వరకు మంటలు అదుపులోకి రాలేదు.
ఈ ఘటనలో మరో నాలుగు భవనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రమాదం జరిగిన భవనం కూలుతుందని భావించిన అధికారులు అందుకు తగిన సహాయక చర్యలు చేపట్టారు.
సమీప కాలనీ ప్రజలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ప్రమాద స్థలానికి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ప్రమాదంలో ఇద్దరి ఆచుకీ తెలియాల్సి ఉందని హోం మంత్రి మహముద్ అలీ అన్నారు.
భవన యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. భవనంలో ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వల్లే ఎక్కువ ప్రమాదం జరిగిందని తెలిపారు.
సమీప ప్రజలకు నష్టం వాటిల్లితే వారికి ఆదుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించి గోదాంలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
భవనం కూలినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/