Madhya Pradesh: మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం.. నిందితుడి ఇంటిని కూల్చేసిన అధికారులు
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు కూల్చివేశారు.

Bhopal: మధ్యప్రదేశ్లోని భోపాల్లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. అయితే నిందితుడు నిబంధనలకు విరుద్దంగా ఇంటిని నిర్మించాడని, అందుకే దానిని కూల్చివేశామని అధికారులు పేర్కొన్నారు.
బాధిత బాలిక భోపాల్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా బస్సు డ్రైవర్ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ పాప బ్యాగ్ లో ఉన్న అదనపు యూనిపామ్ ను తొడిగి ఆమె ఇంటి వద్ద చిన్నారిని వదిలేశాడు. అయితే చిన్నారి తన ప్రైవేట్ పార్ట్ లో నొప్పి ఉందని బాధపడింది. తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా, డ్రైవర్ చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు మరుసటి రోజు స్కూల్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడిని ఆ బాలిక గుర్తించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సెప్టెంబర్ 12వ తేదీన ఆ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి పై డ్రైవర్ అత్యాచారం చేస్తున్న సమయంలో మహిళా అటెండర్ కూడా అక్కడే ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయంలో పాఠశాల యాజమాన్యాన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తారని, వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాహెచ్చరించారు.