Last Updated:

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ అరెస్ట్

 Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ ఇద్దరు పెద్ద వ్యాపారులకు సంబంధం ఉందని ఈడీ వెల్లడించింది. అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా శరత్ చంద్రారెడ్డి శరత్ చంద్రారెడ్డి, వినోయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని పేర్కొనింది. కాగా గత సెప్టెంబర్ నెలలోని 21,22,23 తేదీల్లో ఈ కేసు విషయమై ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్‌ లో సీబీఐ చేర్చింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ కూడా డైరెక్టర్‌గా వ్యవహరించడంతో ఈ కేసులో ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసికి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు గుర్తించిన అధికారులు నేడు ఆయనను అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: అవి నన్ను బాధిస్తున్నాయి.. రష్మిక భావోద్వేగ నోట్