Gold Seized: శంషాబాద్ విమానాశ్రయంలో 7.69 కేజీల బంగారం పట్టివేత
దుబాయి నుండి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 7.69 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురి ప్రయాణీకులను అదుపలోకి తీసుకొన్నారు.
Hyderabad: దుబాయి నుండి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 7.69 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురి ప్రయాణీకులను అదుపులోకి తీసుకొన్నారు. సమాచారం మేరకు, నిన్నటి దినం దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుల తనిఖీల్లో ఓ వ్యక్తి నుండి 4.895కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అదే విధంగా మరో ఇద్దరి ప్రయాణీకుల నుండి 2.8కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ప్యూర్ గోల్డ్ రూపంలో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ మద్య కాలంలో ఇంత మొత్తంలో భారీగా పట్టుబడడం ఇదే కావడం గమనార్హం. దిగుమతి సుంకాన్ని చెల్లించకుండా దేశంలోకి తీసుకురావడం అధికమైంది.
అదే విధంగా నిన్నటిదినం 29కోట్ల రూపాయలు విలువచేసే బ్రాండడ్ వాచీలను కూడా దుబాయి నుండి తరలిస్తుండగా అధికారులు సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: 27కోట్ల విలువైన వాచ్…ఎక్కడ పట్టుబడింది అంటే?