Home / బిజినెస్
ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వేళకు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది.
తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా గ్రూప్ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది.
మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ. 1.46 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగింది. ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు.
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధిక రాయ్ మరియు ప్రణయ్ రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్టును డిసెంబర్ 1న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం అందుబాటులోకి రానుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.