Last Updated:

Elon Musk: యాపిల్ విషయంలో మాట మార్చిన మస్క్

ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు.

Elon Musk: యాపిల్ విషయంలో మాట మార్చిన మస్క్

Elon Musk:  ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు. కొన్ని రోజుల కిందట ట్విట్టర్ లో యాపిల్ తమ ప్రకటనల్ని నిలిపేసిందని, యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తామని బెదిరిస్తోందని అంటూ ట్విట్టర్ వేదికగా మస్క్ పలు ఆరోపణలు గుప్పించారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురించారు. యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తే తానే మొబైల్ ఫోన్ల రంగంలోకి దిగుతానని కూడా మస్క్ హెచ్చరించారు.

అయితే ఈ క్రమంలోనే మస్క్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ అయ్యారు. యాపిల్ ప్రధాన కార్యాలయంలో కుక్ ను కలిసి తర్వాత మస్క్ మాట మార్చేశారు. అసలు యాపిల్ తమ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. టిమ్ కుక్‌తో సమావేశమైన తర్వాత మస్క్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. ఇతర విషయాలతోపాటు, యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ గురించి ఉన్న అపార్థాన్ని కూడా మేము పరిష్కరించామని. యాపిల్ ఎప్పుడూ అలా భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారు’ అని మస్క్ ట్వీట్ చేశారు. దీనితో మస్క్ ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియక యూజర్లు కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ట్విట్టర్ బ్లూటిక్ ఫీజుపై “పేటీఎం” చీఫ్ కౌంటర్

ఇవి కూడా చదవండి: