Home / బ్రేకింగ్ న్యూస్
భారతీయ రైల్వే యొక్క ఉత్తర మధ్య రైల్వే జోన్ నాలుగు రైళ్లను కలపడం ద్వారా 2.7 కిలోమీటర్ల పొడవైన సరుకు రవాణా రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి 'పినాకా' అని పేరు పెట్టింది మరియు తూర్పు మధ్య రైల్వే యొక్క లోడింగ్ సైట్ల నుండి బొగ్గును రవాణా చేయడానికి నాలుగు ఖాళీ రేక్‌లను కలపడం
జార్ఖండ్ అంసెబ్లీలో సిఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటు వేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బిజెపి సభ నుంచి వాకౌట్ చేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) హైదరాబాద్, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ విద్యానగర్‌లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎపుడూ లేనివిధంగా ఒక భక్తుడు సేవలందించడంలో జాప్యం జరుగుతోందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు అతనికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలమయింది. ప్రజలను ఖాళీ చేయడానికి తెప్పలను పంపమని అధికారులను ప్రేరేపించారు. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బిఈఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా వరదనీటిలో చిక్కుకున్నాయి.
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్ధరాత్రి కాల్పుల మోత మోగింది. గ్రామంలో రవాణా శాఖ ఆఫీస్ ఎదుట ఫైనాన్స్ వ్యాపారి ఆదిత్మ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ఎవరో చొరబడడంతో ఆదిత్య వారిని నిలదీశాడు.
సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హెలిక్యాప్టర్ లో జిల్లాకు చేరుకుంటారు. కొత్త కలెక్టరేట్ తో పాటు పార్టీకార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్‌లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.