Last Updated:

Asia cup 2022: టీమిండియా పై గెలిచిన పాకిస్థాన్

ఆసియా కప్‌ 2022 నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Asia cup 2022:  టీమిండియా పై గెలిచిన పాకిస్థాన్

Asia cup 2022: ఆసియా కప్‌ 2022 నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆట చివరి వరకు టీమిండియా గెలుస్తుందని అనుకున్నారు. కానీ టీమిండియా పై పాకిస్థాన్‌ గెలుపొందింది. సూపర్ ఫోర్‌ లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 181 పరుగులను చేసింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే కోహ్లి 40 బాల్స్ కు 60 పరుగులతో చేసాడు. రాహుల్‌ 28 పరుగులు, రోహిత్‌ 28 పరుగుల , సూర్యా కుమార్ యాదవ్ 10 బాల్స్ కు 13 పరుగులు, రిషబ్ పంత్ 12 బాల్స్ కు 14 పరుగులు, హార్దిక్ పాండ్య 0, దీపక్ హోడా 14 బాల్స్ కు 16 పరుగులు చేసారు.

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన పాకిస్థాన్, 182 పరుగులను 19.5 ఓవర్లకె కొట్టేసింది. పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుంటే బాబర్ అజాం 10 బాల్స్ కు 14 పరుగులు, మహమ్మద్ రిజ్వాన్ 51 బాల్స్ కు 71 పరుగులు, జమాన్ 18 బాల్స్ కు 15 పరుగులు, నవాజ్ మెరుగైన ఆట తీరు కనబరచి 20 బాల్స్ కు 40 పరుగులు, షా 11 బాల్స్ కు 14 పరుగులు, అలీ 8 బాల్స్ కు 16 పరుగులు చేసారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ నవాజ్ సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: