Home / బ్రేకింగ్ న్యూస్
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నీటి భాగస్వామ్యం, రైల్వేలు, సైన్స్, వాణిజ్యం మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యల పై ఏడు అవగాహన ఒప్పందాల (ఎంఒయులు) పై సంతకం చేశాయి.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇవాళ రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత షేక్ హసీనా మాట్లాడారు. భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని, ఇండియాకు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని, విముక్తి పోరాట సమయంలో ఇండియా ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్నారు.
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఐఈడీ బాంబు పేలి 35 మంది పౌరులు మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. చనిపోయిన 35 మంది సాధారణ పౌరులేనని అధికారులు వెల్లడించారు. సైన్యం రక్షణలో పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న కాన్వాయ్‌లోని వాహనం
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిజిసిఐ) హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం కోసం మంగళవారం అనుమతి ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. మంగళవారం ట్విట్టర్ లో అతను ఈ విషయాన్ని ప్రకటించాడు. మంగళవారం, అతను ట్విట్టర్లో ఈ ప్రకటన చేసాడు. నా దేశం మరియు రాష్ట్రమైన యుపికి ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం.
కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. 5,6 తరగతి గదుల్లో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ భద్రతను మంజూరు చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ లో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారు ఇకపై జాగ్రత్తగా లేకపోతే వారి జేబుకు చిల్లు పడినట్లే. ఇకపై మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను చికిత్సకోసం లక్నో తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో మరణించారు.