Home / బ్రేకింగ్ న్యూస్
కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు చైనా మరోసారి లాక్ డౌన్ విధించింది. దేశంలోనిఏడు ప్రావిన్షియల్ రాజధానులతో సహా 33 నగరాలు 65 మిలియన్లకు పైగా ప్రజలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తారు. జాతీయ సెలవుల్లో దేశీయ ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలంలోని ఆరిపాక చిన్నయాత పాలెం గ్రామ సమీపంలోని బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్‌ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి.
చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.
డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఉన్నా ఇంజీనీరింగ్ నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభ వార్తా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి మూడో సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్‌కు సంబంధించిన మూడో సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి మరియు కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై 81,326 ఓట్లతో విజయం సాధించారు.
ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్‌లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు.