Home / బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభలో సంతాపం తెలిపారు.
ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి గాను గత నెల 28న పరీక్షలు నిర్వహించగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నేడు ఫలితాలను విడుదల చేసింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులే కాక అటు రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపం తెలియజేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్‌మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు.
కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1569 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిచెయ్యనుంది.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది తెలంగాణా రాజకీయాలు రస్తవత్తరంలో పడుతున్నాయ్. నిన్నటిదాక పార్టీలో అసమ్మతి రాగాల తీసిన ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు టిఆర్ఎస్ గుడ్ బై చెప్పారు