Home / బ్రేకింగ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) సుమారు 700 వర్షపు నీటి కాలువల పై వివిఐపి ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెక్ పార్కులు, హై ప్రొఫైల్ బిల్డర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు డెవలపర్లు ఉన్నారు.
సెమీ హైస్పీడ్ ఇంటర్సిటీ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం అహ్మదాబాద్-ముంబై మార్గంలో ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ 491 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి రైలు 5 గంటల 14 నిమిషాల సమయం పట్టింది.
సికింద్రాబాద్ - విజయవాడ రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు అదే రైలులో ప్రయణిస్తున్న మెడిసిన్ విద్యార్దిని పురుడు పోసిన ఘటన వైరల్ గా మారింది. Medical student helps pregnant woman deliver baby on train
మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం గోవాలో బీజేపీలో చేరారు. దీనితో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు కూల్చివేశారు.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట్లో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెంటీ మీటర్ల వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
కొత్త రూపురేఖలతో సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని కాంగ్రెస్ వర్గాలు తయారుచేయించాయి. సెప్టంబర్ 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్ సన్నహాలు చేస్తోంది. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి ఫొటోలను సోషల్ మీడియాలో కాంగ్రెస్ విడుదల చేసింది.