Home / బ్రేకింగ్ న్యూస్
వెస్ట్ బెంగాల్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారి పై దాడులు చేపట్టింది. భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గేమింగ్ యాప్ పేరుతో యూజర్లు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కోణంలో ఇడి దర్యాప్తు చేపట్టిన కేసులో నోట్ల కట్టలు బయటపడ్డాయి.
హైదరబాదు మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా 4లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించిన్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.
రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు.
ఎగుమతులు అసాధారణంగా పెరగడం, దేశీయ మార్కెట్‌లో సరఫరా తగ్గడం వంటి కారణాలతో నూకలు (విరిగినబియ్యం) ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. నూకల ధర ధర సుమారు రూ. 15-16 (కిలోకి) మరియు తరువాత రూ. 22కి పెరిగింది.
జాతీయ స్థాయి రాజకీయాలపై తెలంగాణ సిఎం కెసిఆర్ దృష్టపెట్టడంపై బిజెపి నేత ఈటెల రాజేందర్ తనదైన శైలిలో విమర్శించారు
వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన. ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకొన్నాడు
ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం 15 రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు మరియు కో-ఇన్‌చార్జ్‌లను ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సాల్‌ను తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాతో సహా మూడు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు స్వస్తి పలుకనున్నారు. ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డేలో పాల్గొనిన అనంతరం ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.