Last Updated:

Agriculture Minister Sudhakar Singh: మా శాఖలో అందరూ దొంగలే.. బీహార్ వ్యవసాయశాఖ మంత్రి సుధాకర్ సింగ్

బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో 'దొంగలకు సర్దార్' నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

Agriculture Minister Sudhakar Singh: మా శాఖలో అందరూ దొంగలే.. బీహార్ వ్యవసాయశాఖ మంత్రి సుధాకర్ సింగ్

Bihar: బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో ‘దొంగలకు సర్దార్’ నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

“మా (వ్యవసాయ) శాఖలో దొంగతనాలు చేయని ఒక్క విభాగం కూడా లేదు. నేను డిపార్ట్‌మెంట్‌కి ఇన్‌చార్జ్‌గా ఉన్నందున, నేను వారికి సర్దార్ అవుతాను. నా కంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మారింది. కానీ పని తీరు అలాగే ఉంది. అంతా మునుపటిలాగానే ఉంది” అని కైమూర్‌లో సింగ్ అన్నారు. నాణ్యమైన వరి సాగు చేయాల్సిన రైతులు బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్‌కు చెందిన వరి విత్తనాలు తీసుకోరు. కొన్ని కారణాల వల్ల వాటిని తీసుకున్నా తమ పొలాల్లో వేయరు. రైతులకు ఊరటనిచ్చే బదులు విత్తనం కార్పొరేషన్లు రూ. 100-150 కోట్లు దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ ప్రభుత్వం పాతదే, పని తీరు కూడా పాతదే. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం సామాన్యుల కర్తవ్యం. మీరు దిష్టిబొమ్మలను దహనం చేస్తే, ఏదో తప్పు జరుగుతోందని నేను గ్రహించాను. కానీ మీరు దీన్ని చేయకపోతే, అంతా ఓకే అని నేను నమ్ముతున్నాను అని సింగ్ కైమూర్ జిల్లాలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సింగ్ గతంలో 2013లో నితీష్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నప్పుడు ‘బియ్యం దుర్వినియోగం’ వివాదంలో చిక్కుకున్నారు.

ఇవి కూడా చదవండి: