Last Updated:

Former minister Narayana: మాజీ మంత్రి లుకౌట్ పై కోర్టు అనుమతి

ఏపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపును మాత్రం వదలడం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణను విదేశాలకు వెళ్లకుండా తలపెట్టిన లుకౌట్ నోటీసును కోర్టు పక్కన పెట్టింది

Former minister Narayana: మాజీ మంత్రి లుకౌట్ పై కోర్టు అనుమతి

Amaravati: ఏపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల పై కక్ష సాధింపును మాత్రం వదలడం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణను విదేశాలకు వెళ్లకుండా తలపెట్టిన లుకౌట్ నోటీసును కోర్టు పక్కన పెట్టింది. ఆయన విదేశాలకు వెళ్లవచ్చంటూ ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయన డిసెంబర్ 22లోపు రావాలని షరత్తు పెట్టింది.

సమాచారం మేరకు, ఓ కేసు విషయం పై లుకౌట్ నోటీసు జారీ చేయాలని ఇమిగ్రేషన్‌ కార్యాలయానికి చిత్తూరు ఎస్పీ లేఖ రాశారు. పోలీసు శాఖ పేర్కొన్నట్లుగా ఇమిగ్రేషన్ కార్యాలయం మాజీ మంత్రి నారాయణ విదేశాలకు వెళ్లకుండా తగిన సూచనలు పాటించారు. వైద్య పరిక్షల నేపధ్యంలో లుకౌట్ నోటీసును తొలగించాలని నారాయణ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు నారాయణ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఓ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంతగా ప్రతిపక్ష నేతలను ఇరుకున పెడుతూ శునాకానందాన్ని పొందుతుంది. అయితే పలు ఆర్ధిక ఉల్లంఘణల కేసుల్లో ఉన్న సీఎం జగన్ మాత్రం విదేశాలకు వెళ్లి రావచ్చా అని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: