Home / బ్రేకింగ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించగా, స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఆత్మహత్యకు యత్నించిన ఒక వృద్ధురాలు ఏకంగా 55 బ్యాటరీలు మింగేసింది. ఆఖరికి వైద్యులు ఆమెకు సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన ఐర్లాండ్ దేశంలో చోటుచేసుకుంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గమైన పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్‌లో ఆదివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది
చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్లో 60మంది అమ్మాయిల వీడియో లీక్ అనే వార్త విధితమే. ఈ సంఘటనతో ఆందోళనలతో యూనివర్సిటీలో అట్టుడికింది. కాగా ఈ ఘటనలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు.
ఏపీలో పెద్ద దుమారం లేపిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సర్వోత్తమ న్యాయస్ధానం విచారణ చేపట్టింది.
బుడిబుడి అడుగుల ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు.