Home / బ్రేకింగ్ న్యూస్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగిన సంగతి విదితమే. కాగా ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరయస్ అయ్యింది. దీనికి బాధ్యులయిన పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. మరికొందరిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.
భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మహాయితే ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే ఒక వారం రోజు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఏడాదిన్నర కాలం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకుంది.
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతుంది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ రాజకీయపార్టీలన్నీ మునుగోడుపై ఫుల్ ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీలకు అక్కడ గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
దాదాపు ఏడు నెలలుగా రష్యా తో కొనసాగుతోన్న యుద్ధంతో ఉక్రెయి న్ అతలాకుతలమవుతోంది. పుతిన్ సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు.
నేషనల్ హెరాల్డ్ కేసులో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్ అలీ , సుదర్శన్‌రెడ్డి అంజన్‌కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డి సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు.
చంద్రబాబు నాయుడు 14ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు