Home / బ్రేకింగ్ న్యూస్
ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు.
టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి టీఆర్ఎస్ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్ వినిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల బాటలోనే హర్యానాలోని మనేసర్‌లో శుక్రవారం ఓ గ్యాంగ్‌స్టర్ ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మనేసర్ గ్యాంగ్‌స్టర్ సుబే సింగ్ గుజ్జర్ అక్రమ ఇంటిని ధ్వంసం చేసింది.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి 'ప్లాన్ 2047' అనే బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకుంది. పిఎఫ్ఐ మరియు దాని 'దేశ వ్యతిరేక' కార్యకలాపాల పై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా ఈ దాడి జరిగింది.
కరోనా కంటే డేంజర్ అయిన వైరస్ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఇప్పుడు గబ్బిలాల నుంచి మానవాళికి సోకుతుందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న ఈ వైరస్‌కు ఖోస్టా-2గా నామకరణం చేశారు.
కార్యకర్తల్ని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా కాలర్ ఎగరేస్తే ఎంతటి వారికైనా భంగ పాటు తప్పదు. అధికార పార్టీ నేతలకైతే కొమ్ములొచ్చాయా అనుకొనేలా వైకాపా ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలు స్వాగతం పలికిన ఆ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకొనింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు, 19 ఏళ్ల అంకితా భండారీ హత్యకు సంబంధించి అరెస్టయిన బిజెపి నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిషికేశ్‌లోని వనతార రిసార్ట్ కూల్చివేసారు.
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని బాలికల పాఠశాలలో మురికిగా ఉన్న మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేస్తున్న వీడియో ఎంపీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది.
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు.