Last Updated:

Munugodu: మునుగోడులో పోస్టర్ల కలకలం.. బీజేపీ కాంట్రాక్ట్ పే అంటూ..!

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.

Munugodu: మునుగోడులో పోస్టర్ల కలకలం.. బీజేపీ కాంట్రాక్ట్ పే అంటూ..!

Munugodu: మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.

బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్‌ రెడ్డి నామినేషన్‌ వేసిన రాత్రే చండూరులో భారీగా పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు ఆ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఫోన్‌ పే తరహాలో కాంట్రాక్ట్‌ పే, 18వేల కోట్ల ట్రానాక్షన్‌ రాజగోపాల్‌ ఖాతాలో జరిగిందంటూ పోస్టర్లు అంటించి ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి 18వేల కోట్ల కాంట్రాక్ట్‌ కేటాయించారంటూ చండూరు వ్యాప్తంగా ఉన్న షాపులు, గోడలపై రాత్రికే రాత్రే వేల సంఖ్యలో పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు.

ఇకపోతే మునుగోడు బై పోల్‌ ప్రచారంలో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం మొదలయ్యింది. కాంట్రాక్ట్‌ వ్యవహారంలో తెరాస- భాజపా మధ్య మాటలు యుద్ధం జరుగుతోందనే చెప్పాలి.
రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బులేవో జిల్లా అభివృద్ధికి ఇస్తే తామే ఎన్నికల పోటీనుంచే తప్పుకుంటాం కదా అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా ఈ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి గట్టిగానే స్పందించారు. బీజేపీకి తాను అమ్ముడుపోలేదని, కాంట్రాక్ట్‌ విషయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయానికి తడిబట్టలతో వస్తానని దీనికి కేటీఆర్‌, కేసీఆర్‌ సిద్ధమా? అంటూ రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. అయితే కోమటిరెడ్డి చేసే ప్రమాణాలకు విలువే లేదని టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన కుటుంబ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడే తప్ప నియోజకవర్గ ప్రజల కోసం కాదని విమర్శించారు.

ఇదీ చదవండి: నన్ను గెలిపిస్తే.. రూ.20 పెట్రోల్, రూ. 100కే గ్యాస్..!

ఇవి కూడా చదవండి: