Last Updated:

Fire Accident: ఉగాండాలో అగ్ని ప్రమాదం..11 మంది అంధ విద్యార్ధులు మృత్యవాత

ఉగాండాలో ఘోరం చోటుచేసుకొనింది. ఓ పాఠశాలలో చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్ధులు అగ్నికి ఆహుతైనారు. శరీరాలు సైతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తీవ్ర గాయాలైన మరికొంత మంది విద్యార్ధులను వైద్యశాలకు తరలించారు.

Fire Accident: ఉగాండాలో అగ్ని ప్రమాదం..11 మంది అంధ విద్యార్ధులు మృత్యవాత

Uganda: ఉగాండాలో ఘోరం చోటుచేసుకొనింది. ఓ పాఠశాలలో చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్ధులు అగ్నికి ఆహుతైనారు. శరీరాలు సైతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తీవ్ర గాయాలైన మరికొంత మంది విద్యార్ధులను వైద్యశాలకు తరలించారు.

పోలీసుల సమాచారం మేరకు, రాజధాని కంపాలాకు తూర్పున ఉన్న ముకోనోలోని బోర్డింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొనింది. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. గాయపడిన వారిని స్థానిక వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు వారి పరిస్థితిని అంచనా వేశారు. ఎక్కువగా చేతులు, కాళ్ళు మరియు ఛాతీ పై గాయాలైనట్లు పేర్కొన్నారు. నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

విద్యాశాఖ మంత్రి జాయిస్ కడుచు మృతి చెందిన విద్యార్ధుల పట్ల సంతాపం తెలిపారు. తల్లి తండ్రులను ఓదార్చారు. గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన విద్యార్ధులను గుర్తించేందకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని మంత్రి తెలిపారు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో ఇలాంటి ఘటనల సమయంలో రెస్కూ ప్రయత్నాలలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ ఏడాది తొలి త్రైమాశికంలో ఉగాండాలోని పలు పాఠశాలల్లో 18 అగ్ని ప్రమాదాలు జరిగాయని పోలీసు నివేదికలు చెపుతున్నాయి.

ఇది కూడా చదవండి:Earthquake: ఖాట్మాండ్ లో భూకంపం

ఇవి కూడా చదవండి: