Last Updated:

Huge Fire Accident: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 200 దుకాణాలు

అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది.

Huge Fire Accident: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 200 దుకాణాలు

Arunachal Pradesh: అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు, ఇటానగర్ సమీపంలోని నవర్లాగన్ డైలీ మార్కెట్టులోని ఓ ఇంటి నుండి మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న రెండు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారాన్ని వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి చేరవేశారు.

అయితే వారు వచ్చేందుకు రెండు గంటల ఆలస్యం కావడంతో శరవేగంగా రెండు వందల దుకాణాలకు వ్యాపించిన మంటలు వాటిని బూడిద చేశాయి. వెదురు, కలపతో తయారచేసిన ఉత్పత్తుల దుకాణాల్లో ఉండడంతో మంటలు త్వరితగతిన వ్యాపించాయి. ఒక దశలో రెండు ఫైరింజన్లు వచ్చిన్నప్పటికీ జరిగాల్సిన నష్టం జరిగిపోయింది.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన అగ్నిమాపక సిబ్బందిని వెంటనే తొలగించాలంటూ నవర్లాగన్ బజార్ సంక్షేమ కమిటీ అధ్యక్షులు కిపా నైని పేర్కొన్నాడని పీటీఐ వార్త సంస్ధ పేర్కొనింది. క్యాపిటల్ కాంప్లెక్స్ లోని వివిధ ప్రదేశాల్లో వాటర్ ఫిల్లింగ్ పాయింట్ల ఏర్పాటులో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ఆయన పేర్కొన్నారు. రాజధాని నడిబొడ్డునే ఇలాంటి పరిస్ధితి ఉంటే ఇక మారు మూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంగతి ఏంటని నిలదీశారు. జరిగిన ఘటన పై ఇటానగర్ శాసనసభ్యులు టెకీ కాసో విచారం వ్యక్తం చేశారు. ఎసిసి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ పునర్నర్మించనుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Gujarat: వడోదరలో అల్లర్లు.. పోలీసులపై పెట్రోల్ బాంబులు

ఇవి కూడా చదవండి: