Home / బ్రేకింగ్ న్యూస్
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్ అతనిపై అనర్హత వేటు వేసింది.
ప్రభుత్వరంగ సంస్ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.. 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వన్‌టైం సెటిల్మెంట్ స్కీం గడువు రేపటితో ముగియనుంది.
మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది.
తనకు ప్రాణాంతకమైన ‘మైయోసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు సమంత ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ ఫొటో షేర్ చేసింది.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు.
తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని వరాహ రూపం దైవవరిష్టం పాటను థియేటర్లలో ప్లే చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉచితాల వంటి అంశాలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ పేర్కొంది.