CM Chandrababu: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు.. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు
CM Chandrababu’s speech in Davos: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా చూసిన భారతీయ వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, భారత్‌లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్ టాప్ -1లో ఉంటుందన్నారు. ఇక, ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, 25 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు వివరించారు. రెండెంకెల వృద్ధిరేటు సాధిస్తే అద్భుతాలు సృష్టించగలమని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా సమాజంలో మార్పులు వస్తాయన్నారు. ఇక్కడ ఉన్న అందరినీ చూస్తే నమ్మకం పెరిగిందని, భవిష్యత్తులో నేను కన్న కలలు నిజమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌర విద్యుత్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి సూర్యఘర్ కింద ఇంటింటికీ సౌర ఉత్సత్తి అందించేలా కొత్తగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందులో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. 115 బిలియన్ల డాలర్ల పెట్టుబడి ఇంధన వనరుల్లో వస్తుందని, 500 మెగావాట్ల, 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.