Last Updated:

MLAs poaching case: కౌంటర్ వేయండి, అనంతరమే దర్యాప్తు చేపట్టండి.. ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు ఆదేశాలు

తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది.

MLAs poaching case: కౌంటర్ వేయండి, అనంతరమే దర్యాప్తు చేపట్టండి.. ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు ఆదేశాలు

Hyderabad: తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా సాగిన ఘటనలో సరైన సాక్ష్యాలు లేవంటూ నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబి న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో హైకోర్టు మెట్లెక్కిన పోలీసులకు నిందితులు ముగ్గురు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యవహారం ఆధ్యంతం పలు అనుమానాలకు తావిస్తుందని, దీన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ లేదా సట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కేసుపై దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ భాజపా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

విచారణలో ముఖ్యాంశాలలో, పిటిషన్‌ పై ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జె.ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ పార్టీ(బీజేపీ) నిందితుల జాబితాలో లేకపోయన్నప్పటికీ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసే అర్హత (లోకస్‌ స్టాండీ) ఉందని స్పష్టం చేశారు. నిందితులు బీజేపీకి చెందిన వారని చెబుతూ, అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసు ఎఎఫ్ఐఆర్ లో పేర్కొన్న మేర నిందితులు తమ పార్టీ వారు కాదని నిరూపించాలని, తమ పార్టీ నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు ఉంచడానికి స్వతంత్ర దర్యాప్తు ఏజెన్సీలతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

అధికార పార్టీ ఆదేశాల మేరకు మొత్తం పోలీసు వ్యవస్థ ఈ కేసు దర్యాప్తులో భాగమైందని, దర్యాప్తు తీరును చూస్తే,  అందులో కుట్ర పూరిత ఉద్దేశం ఉన్నదని ప్రజలకు కూడా అర్థమవుతోందని తెలిపారు. పిటిషనర్‌ పార్టీకి తీవ్ర నష్టానికి గురిచేసేలా ఉందన్నారు. కేసు నమోదు కాకముందే. సైబరాబాద్‌ కమిషనర్‌ ఘటనా స్థలానికి వచ్చి, టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడిన తీరు అనుమానాస్పదనంగా ఉందన్నారు. ఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయమైన ప్రగతిభనవ్‌కు వెళ్లారని, దీనిప్రకారం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కుట్ర జరిగినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలు పబ్లిక్‌ సర్వెంట్ల కిందకురారని.. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం వర్తించదని తెలిపారు. రిమాండ్‌ డైరీ, పంచనామా 26వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 వరకు రాసినట్లు ఉందని, సాక్షుల సంతకాలు మాత్రం 27న తీసుకున్నారని తెలిపారు. దీన్నిబట్టి పోలీసులు ముందస్తుగా సిద్ధమయ్యారని తెలుస్తోందన్నారు.

అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ,  పిటిషనర్‌ పార్టీకి పిటిషన్‌ దాఖలు చేసే అర్హత లేదని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు రాష్ట్రంలోకి రాకుండా జీవో-51 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నదని గుర్తుచేశారు. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టం ప్రకారం సీబీఐ రాష్ట్రంలోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉండాలని తెలిపారు.
ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్‌ సర్వెంట్ల పరిధిలోకి వస్తారని, ఈ నేపథ్యంలో ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అర్ణబ్‌ గోస్వామి తీర్పు ప్రకారం ప్రస్తుత పిటిషనర్‌ పార్టీకి లోకస్‌ స్టాండీ లేదని తెలిపారు. రోమిల్లా థాపర్‌ తీర్పు ప్రకారం హైకోర్టులు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దర్యాప్తును ఇతర ఏజెన్సీలకు బదిలీ చేసే అవకాశం ఉందని తెలిపారు. నిందితులతో తమకు సంబంధం లేదని బీజేపీ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కేసు దర్యాప్తును బదిలీ చేయాలని కోరాల్సిన అవసరం వారికి ఏముందని ప్రశ్నించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం, రిమాండ్‌ కేసు డైరీలో వివరాలు, సాక్షుల సంతకాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత పూర్తిస్థాయి వాదనలు వింటామని వ్యాఖ్యానించింది.

దర్యాప్తును ఆపేయాలని పిటిషనర్‌ పార్టీ ప్రత్యేకంగా అడగలేదని ఏఏజీ పేర్కొంటున్నారని, మరోవైపు పిటిషనర్‌ న్యాయవాది కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలైన కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసే వరకు వాయిదా వేస్తున్నామని పేర్కొన్నది. కేసు మెరిట్స్ పై తాము ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని తెలిపింది. తాము కేసుపై స్టే విధంచలేదని, దర్యాప్తును వాయిదా వేశామని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత అన్ని విషయాలు పరిశీలిస్తామని స్పష్టంచేసింది. మరో హైకోర్టు ధర్మాసనం తీర్పు కాపీ అందిన తర్వాత కావాలంటే తమ ఆదేశాల్లో సవరణలు కోరవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు మొయినాబాద్‌ కేసు దర్యాప్తును వాయిదా వేయాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

ఇవి కూడా చదవండి: