Home / బ్రేకింగ్ న్యూస్
సూపర్‌స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక వినూత్న వీడియోను షేర్ చేసారు. ఇది ఎల్పిజి సిలిండర్లను క్యూఆర్ కోడ్లతో ఎలా పొందుపరచబడుతుందో చూపిస్తుంది. తద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు.
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కళ్యాణదుర్గం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్డును శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు.