Minister Usha Sri Charan: వైసీపీకి షాక్.. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కళ్యాణదుర్గం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Usha Sri Charan: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న ఆమెపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఉషశ్రీపై కేసు నమోదయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించినందుకు అప్పటి తహసీల్దార్ డి.వి. సుబ్రహ్మణ్యం ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 188 సెక్షన్ కింద ఆమెతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కాగా అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో పలుమార్లు విచారణలు జరుగగా ప్రతీసారి ఆమె గైర్హాజరు అవుతూ వచ్చారు. అనంతరం నిన్న అనగా బుధవారం కూడా కళ్యాణదుర్గం కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. కాగా ఈ సారి కూడా కోర్టు విచారణకు మంత్రి ఉషశ్రీ గైర్హాజరు కావడంతో ఆమెతో పాటు ఈ కేసులోని మరో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుబాన్ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి నారాయణపై సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి