Home / బ్రేకింగ్ న్యూస్
తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది
మస్క్ మామ ఛార్జీలు మరల షురూ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను సర్వీసులను మరల పునరుద్ధరించనున్నాడు. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ ను మెయింటేన్ చేయాలన్నా లేదా కొత్త ఎకౌంట్ తీసుకోవాలన్నా డబ్బు చెల్లించాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో విషాదం నెలకొనింది. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికల ఆలోచన పెట్టుకోవద్దని సీఎం కేసీఆర్ పార్టీనేతలకు చెప్పారు.
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ వీడ్కోలు పలికారు.
టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నివాళులర్పిస్తూ నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఉదయం 4గంటల సమయంలో కన్నుమూశారు. కాగా ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని మహేష్ ఇంట్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సందర్శార్థం ఉంచారు. కాగా ఆయన పార్ధివ దేహానికి రేపు పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.
అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి విధ్వసం సృష్టించారు. సీనియర్ నాయకుడు భరత్‌సింగ్ సోలంకీ పోస్టర్లను తగులబెట్టారు.