Home / బ్రేకింగ్ న్యూస్
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఇదేం కర్మ' అనే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.
ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. వేడుకలకు హాజరయ్యి 21 మంది సజీవదహనం అయ్యారు. అందులో 17 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఆవేదనకరం. ఈ దుర్ఘటన పాలస్తీన గాజాలోని శరణార్థుల శిబిరంలో చోటుచేసుకుంది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ అరవింద్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్‌లో విజయవంతంగా ప్రయోగించబడింది.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో గూడూరు జంక్షన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాల పై, సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.