Home / బ్రేకింగ్ న్యూస్
బిహార్‌లో జన్మించిన ఓ వింత శిశువును స్థానికులు గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు.ఎందుకలా అంటున్నారు అంటే శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉండడమే ఈ ప్రచారానికి కారణం.
సూపర్ స్టార్ కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతి వార్తతో సినీలోకం ఒక్కసారిగా మూగబోయింది. సూపర్ స్టార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు అశ్రునివాళులు అర్పించారు.
నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీ నాట విషాధ ఛాయలు నెలకొన్నాయి. కళామ్మతల్లి ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. వెండితెరపై నాలుగు దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా వెలుగొంది.. తెలుగు సినీ ఖ్యాతిని ఖండాతరాలకు చాటి చెప్పిన హీరో కృష్ణ ఇకలేరు.
తెలంగాణలో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో విద్యాబోధన తరగతులను ప్రారంభించనున్నారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతోందన్న ఆరోపణల పై అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు.
పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రాలు అలాంటి చర్యకు అంగీకరించే అవకాశం లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్నారు.
గన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్ కల్యాణ్. ఏంటా కొత్త నినాదం. అది పవన్‌కు వర్కవుట్ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.
మునుగోడు ఊపులో ‘ముందస్తు' ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని సమాచారం. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది.