Home / బ్రేకింగ్ న్యూస్
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సహాయకుడు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని, అతని నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్‌ను అంకితం చేశారు. ఫిబ్రవరి 2019లో ఆయన విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. మరి ఆ పాలసీ వివరాలేంటో చూసేయ్యండి.
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి మరో లేఖ విడుదల చేసాడు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.
ప్రెగ్నెంట్ అంటూ తనపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తరుణంలో వాటిపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేశారు. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ కౌంటర్ వేశారు.