Home / బ్రేకింగ్ న్యూస్
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్‌షిప్‌లోని బార్లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నుంగంబాకం ఇంట్లో ఆరుగురు సీబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఓ సారి కార్తీ చిదంబరం ఇంటిపై దాడి చేసినప్పుడు ఆ గదికి తాళాలు వేసి ఉన్నాయి. దాని తాళం చెవులు మాత్రం కార్తీ వద్దనే ఉన్నాయి. అప్పుడు ఆయన లండన్ ఉన్నారు.
కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి పాలంకి బ్రదర్స్ షాకిచ్చారు. వైసిపి వీడి వారిద్దరూ జనసేనలో చేరారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పాలంకి సారధిబాబు, మోహన్ బాబు జనసేనలో చేరారు. జనసేన జెండా కప్పి పాలంకి బ్రదర్స్ ను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ తో డీల్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్విటర్ విలీనం ఒప్పందంలోని పలు నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు.