Wimbledon Tennis tournament: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎలీనా రైబాకినా
కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది.

కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది. జాబెర్ పై 3-6, 6-2, 6-2 తేడాతో విజయం సాధించిన రైబాకినా కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకుంది.