Home / బ్రేకింగ్ న్యూస్
జూన్ త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరకు విక్రయించడం వల్ల రూ.10,700 కోట్ల నష్టం వాటిల్లవచ్చని సోమవారం ఒక నివేదిక వెల్లడించింది.
యూఎస్ డాలర్‌తో పోల్చితే రూపాయి 22 పైసలు క్షీణించి 79.48 (తాత్కాలిక) వద్ద జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది, ఇది విదేశాలలో బలమైన గ్రీన్బ్యాక్ మరియు దేశీయ ఈక్విటీలను తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం రూపాయి నష్టాన్ని పరిమితం చేసిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 జూలై 17న జరుగుతుంది, నిరసనలు ఉన్నప్పటికీ, అధికారులు పరీక్ష తేదీలను మార్చలేదు. మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం నమోదు చేసుకున్న 18 లక్షల మంది విద్యార్థులు ఒకే సమయంలో పెన్ మరియు పేపర్ విధానంలో పరీక్ష రాయనున్నారు. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పరీక్ష.
వెస్ట్ సెంట్రల్ రైల్వే వివిధ NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను కోరుతోంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ - wcr.indianrailways.gov.in ద్వారా ఆన్లైన్లో పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 28, 2022. ఈ రిక్రూట్మెంట్ద్వారా డిపార్ట్మెంట్లో మొత్తం 121 ఖాళీపోస్టులు
తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రెండు గ్రూపుల మధ్య పోరు తారస్దాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ద్వంద్వ-నాయకత్వ నమూనాకు స్వస్తి పలికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు నేడు జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పళనిస్వామిని ఎన్నుకుంది.
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
చివరి టీ20లో ఓడిపోయిన టీమిండియాభారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.