Last Updated:

Elon Musk: 44 బిలియన్ల ట్విట్టర్ డీల్ ను రద్దుచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ తో డీల్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్‌ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్విటర్‌ విలీనం ఒప్పందంలోని పలు నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు. 

Elon Musk: 44 బిలియన్ల ట్విట్టర్ డీల్ ను రద్దుచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్

Washington: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ తో డీల్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్‌ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్విటర్‌ విలీనం ఒప్పందంలోని పలు నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు.

ఎలాన్‌ మస్క్‌ట్విట్టర్‌ కొనుగోలుకు వెనకడుగు వేయడంతో ట్విట్టర్‌ చైర్మన్‌ బ్రెట్‌ టైలర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాంలో స్పందిస్తూ, మస్క్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దీనిపై బోర్డులో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ట్విట్టర్‌ బోర్డు కూడా మస్క్‌తో ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే ఆలోచనలో ఉందని బ్లాగ్‌లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మస్క్‌ లాయర్లు స్టాక్‌ మార్కెట్లకు సమాచారం ఇస్తూ, ట్విట్టర్‌ పేక్‌ స్పామ్‌ ఖాతాలు గురించి వివరాలు అడిగినా ఇవ్వలేదని అందుకే ఒప్పందం రద్దు చేసుకుంటున్నామని స్టాక్‌ మార్కెట్లకు సమాచారం అందించారు. అలాగే ఒప్పందంలోని పలు నిబంధనలు ట్విట్టర్‌ ఉల్లంఘించిందని, తప్పుడు సమాచారం ఇచ్చి తమను తప్పుదోవ పట్టించిందని  వివరించారు. మస్క్‌ట్విట్టర్‌తో ఒప్పందం కుదర్చుకున్నప్పుడు ఫేక్‌ అకౌంట్స్‌ వివరాలు ఇస్తామని చెప్పి ముఖం చాటేసిందని స్టాక్‌ మార్కెట్లకు సమాచారం అందించారు.

దీంతో పాటు మస్క్‌ ట్విట్టర్‌ పై మరో ఆరోపణ సంధించారు. టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను తప్పించిందని, సంస్థలో పనిచేసే మూడోవంతు టాలెంటెడ్‌ టీంను ఇంటికి పంపించిందన్నారు. ఇవన్నీ నమ్మక ద్రోహం కిందికి వస్తాయని ఎలాన్‌ మస్క్‌ తన చర్యను సమర్థించుకున్నారు. మస్క్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి ప్రతి రోజు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. ఫేక్‌ అకౌంట్స్‌ ఐదు శాతం వరకు ఉంటాయని ట్విట్టర్‌ ప్రకటిస్తే, కాదు 25 శాతం వరకు ఉంటాయని మస్క్‌ వాదించారు. మరోమారు అవసరం కంటే ఎక్కువ సిబ్బంది ఉన్నారని, వారి వేతనాలుకూడా చాలా ఎక్కువగా ఉన్నాయని తన చేతికి కంపెనీ వచ్చిన వెంటనే సగం మందిని ఇంటికి పంపిస్తామని చెప్పడంతో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడింది. సాధారణ ఉద్యోగే కాదు. సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ పై కూడా ఆయన తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు. అంత జీతం ఆయనకు అవసరం లేదని, వచ్చిన వెంటనే సీఈఓ సహా సిబ్బందిని పూర్తిగా మార్చేస్తానని బహిరంగ ప్రకటనలు చేయడం కూడా మస్క్‌కే  చెల్లింది.

ఇదిలా ఉండగా మస్క్‌ తీసుకున్న నిర్ణయంతో ట్విట్టర్‌ న్యాయపోరాటానికి దిగనుంది. రాబోయే కొద్ది వారాల్లో కోర్టు ప్రోసిడింగ్స్‌ ప్రారంభమై త్వరలోనే తీర్పు కూడా వెలువడే అవకాశం ఉందని ట్విట్టర్‌ భావిస్తోంది. ఇక్కడ అసలు విషయానికి వస్తే, సాధారణంగా కంపెనీలు టేకోవర్‌ చేసేటప్పుడు ఒక ధర చెప్పి తర్వాత మరో ధర ఇస్తామని చెప్పడం ఆ తర్వాత వివాదం కాస్తా కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది. అయితే చాలా కేసుల్లో జడ్జి తీర్పు ఇవ్వడానికి ముందే ఈ కంపెనీలు ఔట్‌ ఆఫ్‌ కోర్టు సెటిల్మెంట్లు చేసుకుంటాయి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే కోవిడ్‌ కంటే ముందు ఒప్పందాలు చేసుకొని అటు తర్వాత ధర తగ్గించడానికి ఇరు కంపెనీలు ఆమోదం తెలిపిన అంశాలు చాలానే ఉన్నాయి.

కోర్టులో వాదించేందుకు చట్టం పరంగా మస్క్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఎందుకంటే మస్క్‌తో ఒప్పందం కుదర్చుకున్నప్పుడు ట్విట్టర్‌ ఇచ్చిన సమాచారం. క్లాజులు ఉల్లంఘిస్తే ఒప్పందం నుంచి తప్పుకునేందుకు మస్క్‌కు అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా శక్రవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్లో దీని షేరు ఆరు శాతం క్షీణించి 34.58 డాలర్లు దిగివచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాస్క్‌ ఒక్కో షేరును 54.20 డాలర్లు కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదర్చుకున్న నాటితో పోల్చుకుంటే షేరు ధర 36 శాతం వరకు క్షీణించింది. ఈ  ఏడాది ఏప్రిల్‌లో మస్క్‌ ట్విట్టర్‌ టేకోవర్‌ చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే దీని షేరు స్టాక్‌ మార్కెట్లో దూసుకుపోయింది. ఏప్రిల్‌ 25న ఒప్పందం జరిగితే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ షేరు క్రమంగా క్షీణించడం మొదలైంది. మస్క్‌ ఈ డీల్‌ నుంచి తప్పుకుంటాడని ఆరోజే ఇన్వెస్టర్లు ఒక అంచనాకు వచ్చారు. దీంతో ఈ షేరు క్రమంగా తగ్గముఖం పడుతూ వచ్చింది.

ఇవన్నీ ఇలా ఉంటే ఒక వేళ కాంట్రాక్టును మస్క్‌ రద్దు చేసుకుంటే బిలియన్‌ డాలర్లు ట్విట్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మస్క్‌ ట్విట్టర్‌ ఒప్పందం రద్దు చేసుకోవడం ట్విట్టర్‌కే భారీ నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్విట్టర్‌ బోర్డు మస్క్‌ నుంచి బిలియన్‌ డాలర్లు ఎలా రాబట్టుకోవాలో న్యాయం పోరాటం చేయాల్సి ఉంటుంది. మస్క్‌ నుంచి ట్విట్టర్‌ బిలియన్‌ డాలర్లు రాబడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి: