Home / బ్రేకింగ్ న్యూస్
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్‌లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా, మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందన్నారు.
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు గత ఏడాదితో పోల్చితే జూలై 7 నాటికి 15 శాతం తగ్గింది. మొత్తంగా, రైతులు 6.3 మిలియన్ హెక్టార్ల (Ha) పొలాల్లో విత్తలేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ (CMIE) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ జూన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం వ్యవసాయరంగంలో ఉపాధిని దెబ్బతీసిందని చెప్నారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.
వాట్సాప్ వినియోగదారులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది మరియు మెసేజింగ్ యాప్ యొక్క నకిలీ వెర్షన్ల గురించి తెలుసుకోవాలని వారిని కోరుతోంది. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ యొక్క సీఈవో విల్ కాత్‌కార్ట్, వినియోగదారులు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నందున, వాట్సాప్ సవరించిన వెర్షన్ ఉపయోగించవద్దని ట్విట్టర్లో ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
స్పైస్‌జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌సింగ్ పై గురుగ్రామ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తకు కోట్లాది షేర్లను మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. విమానయాన రంగానికి చెందిన కన్సెల్టెంట్ అమిత్ అరోరా తను చేసిన సేవలకు గాను 10 లక్షల విలువ చేసే షేర్లు, నకిలి డిపాజిటరీ ఇన్స్ర్టక్షన్ స్లిప్స్అందజేశారు.
ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి విచారణలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, తాను 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను "చంపాలనుకున్నట్లు" విచారణలో వెల్లడించాడు. హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1998 చింకారా వేట కేసులో సల్మాన్‌ఖాన్‌ను చంపాలనుకుంటున్నట్లు బిష్ణోయ్ పోలీసులకు చెప్పినట్లు
ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్‌సెల్వం ను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం హాస్యస్పదమని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. దీనిపై ఆయన ఎన్ సి సి అధినేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు.దీన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చే వారు చాలా మంది ఉన్నారు. ఇది హిందువులు మరియు ముస్లింల గురించి కాదు.
లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మరోకరు బలయ్యారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు తీసుకుంది. అయితే లోన్ తీసుకున్న తరువాత ప్రతీ నెల చెల్లింపులు చేసిన ప్రత్యూష. మరో 8వేలు చెల్లించాల్సి ఉంది.