Last Updated:

Salman Khan: సల్మాన్ ఖాన్ ను చంపడానికి రూ.4 లక్షలతో రైఫిల్ కొన్నాను.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్

ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి విచారణలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, తాను 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను "చంపాలనుకున్నట్లు" విచారణలో వెల్లడించాడు. హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1998 చింకారా వేట కేసులో సల్మాన్‌ఖాన్‌ను చంపాలనుకుంటున్నట్లు బిష్ణోయ్ పోలీసులకు చెప్పినట్లు

Salman Khan: సల్మాన్ ఖాన్ ను చంపడానికి రూ.4 లక్షలతో రైఫిల్ కొన్నాను.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్

Delhi: ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి విచారణలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, తాను 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను “చంపాలనుకున్నట్లు” విచారణలో వెల్లడించాడు. హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1998 చింకారా వేట కేసులో సల్మాన్‌ఖాన్‌ను చంపాలనుకుంటున్నట్లు బిష్ణోయ్ పోలీసులకు చెప్పినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులు సల్మాన్ ఖాన్ మరియు అతని తండ్రి సలీం ఖాన్‌ను బెదిరిస్తూ లేఖ పంపినట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. ర్యానా, రాజస్థాన్ మరియు పంజాబ్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీకి చింకారా లేదా కృష్ణజింకలు చాలా ప్రియమైనవని బిష్ణోయ్ విచారణలో చెప్పినట్లు తెలిసింది. అక్టోబరు 1998లో రెండు కృష్ణజింకలను చంపినందుకు గాను ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు 2018 ఏప్రిల్‌లో ఐదేళ్ల జైలు శిక్ష విధించడం, దీనిని సల్మాన్ కోర్టులో సవాల్ చేయడం తెలిసిన విషయమే.

తన విచారణలో, సల్మాన్ ఖాన్‌ను చంపాలని రాజ్‌గఢ్‌కు చెందిన తన సహచరుడు సంపత్ నెహ్రాకు చెప్పినట్లు బిష్ణోయ్ అంగీకరించాడు. సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు సంపత్ నెహ్రాను ముంబైకి తరలించారని, నటుడి ఇంటి చుట్టూ తిరిగారని లారెన్స్ బిష్ణోయ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నెహ్రా వద్ద పిస్టల్ మాత్రమే ఉందని, దూరంనుంచి కాల్పులు జరిపే ఆయుధం లేదని, బిష్ణోయ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ దినేష్ దాగర్ అనే వ్యక్తి ద్వారా ఆర్‌కె స్ప్రింగ్ రైఫిల్‌ను ఆర్డర్ చేశాడు, రైఫిల్‌ను రూ.4 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

మరోవైపు కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ తరపున వాదిస్తున్న న్యాయవాది హస్తి మల్ సరస్వత్ జూలై 6న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. న్యాయవాదుల కార్యాలయాలు ఉన్న హైకోర్టు జూబ్లీ ఛాంబర్‌లోని డోర్ నాబ్‌లో జూలై 3న బెదిరింపు లేఖ దొరికిందని సరస్వత్ తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు

ఇవి కూడా చదవండి: