Home / బ్రేకింగ్ న్యూస్
గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా, నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది.
ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిమ్ మహిళలకు తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. అయితే ఒకే సారి కాకుండా, నెలకోసారి చొప్పున మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం కాదని తేల్చింది.
ఇప్పటికే పలు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలను డెయిరీ కంపెనీలు కూడ బాదడం ప్రారంభించాయి. డెయిరీ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న అమూల్ మంగళవారం ప్యాక్డ్ మిల్క్‌పై లీటరు ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది.
మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కూటమి భాగస్వామి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎక్కువ మంత్రిపదవులు లభించాయి. కాంగ్రెస్‌తో సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులను
థర్డ్ పార్టీల నుండి మితిమీరిన ప్రభావం" కారణంగా భారతదేశాన్ని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి (ఫిఫా)మంగళవారం సస్పెండ్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును దేశం నుండి తొలగించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడ్డింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో హైకోర్టులో నేడు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాళ్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జడ్జిలుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్, అడిషినల్ జడ్జిలుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు,
కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వెనకనుంచి కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.