Home / బ్రేకింగ్ న్యూస్
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్‌కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.
మహారాష్ట్రలో ఉగ్రవాదులు మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ముంబై నుంచి రాయ్‌ఘడ్ వెళ్లే మార్గంలో ఉన్న హరిహరేశ్వర్ బీచ్‌లో అనుమానాస్పద బోట్లను పోలీసులు గుర్తించారు. రెండు బోట్లలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి లభ్యమైంది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
క్యాసినో కేసులో . ప్రధాని నిందితుడు చికోటి ప్రవీణ్ సంచలణ కామెంట్స్ చేశారు. తనను చంపేస్తానంటూ విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. హిట్ మెన్ అనే యాప్‌లో సుపారి ఇచ్చామని.. త్వరలోనే నీ ప్రాణాలు పోతాయంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్పారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనుంది. అయితే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల సర్వదర్శనానికే ప్రాధాన్యం కల్పించేలా ఆ తొమ్మిది
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ - సుక్కూర్ మోటార్‌వేలో ఆయిల్ టాంకర్‌ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.