Home / బ్రేకింగ్ న్యూస్
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించగా 13 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్లో ఉన్న 101 నంబరు ఫ్లాటులో ఆయన ఉరి
మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడులో లక్ష మందితో నిర్వహించనున్న ‘ప్రజా దీవెన’ సభకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. అయితే పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆంక్షలు విధించారు.
ప్రతి ఇంట్లోను ఈ టాబ్లెట్ తప్పకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జర్వం వస్తే, తప్పకుండా వాడేది డోలో టాబ్లెట్. ప్రస్తుతం ఇదే డోలో టాబ్లెట్‌కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. డోలో టాబ్లెట్ తయారు చేసే కంపెనీ
జగిత్యాల జిల్లాలో సరోగసీ విధానం ద్వారా దూడలకు జన్మనిస్తున్నాయి పాడిపశువులు. ఎల్డీఏ, కోరుట్ల పశువైద్యకళాశాల సంయుక్తంగా చేపట్టిన సరోగసి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కోడెకవల దూడలు జన్మించాయి.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాల పంపిణీకి ఉపయోగించే డ్రోన్‌ను అడ్డగించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్ అంబర్ పేట నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం మంటలతోనే ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకునే యత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది.
కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది.