Last Updated:

Top 10 Best Selling Cars: మీరు కొనాల్సిన పది బెస్ట్ కార్లు ఇవే.. వీటిని కొనేందుకు షో‌రూమ్‌లకు జనాలు క్యూ!

Top 10 Best Selling Cars: మీరు కొనాల్సిన పది బెస్ట్ కార్లు ఇవే.. వీటిని కొనేందుకు షో‌రూమ్‌లకు జనాలు క్యూ!

Top 10 Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితా (SEP 2024) అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో మారుతీ సుజుకీ నుండి టాటా మోటార్స్ వరకు కార్లు ఉన్నాయి. మీరు ఈ నెలలో కొత్త కారుని కొనాలని చూస్తున్నట్లయితే ఈ 10 కార్లు గురించి తెలుసుకోండి. ఉత్తమమైన కారును ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.

1. మారుతి సుజుకి ఎర్టిగా
మారుతీ ఎర్టిగా గత నెలలో (సెప్టెంబర్) 17,441 యూనిట్లను సేల్ చేసింది. దీని ద్వారా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మారుతి సుజుకి 3913 ఎర్టిగా యూనిట్లను ఎక్కువగా విక్రయించింది. ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది CNGలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫ్యామిలీ కారు ధర రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

2. మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి స్విఫ్ట్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే సంచలనం సృష్టించింది. అయితే ఈసారి 16,421 యూనిట్ల స్విఫ్ట్ అమ్ముడైంది. స్విఫ్ట్ రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

3. హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కస్టమర్లు బాగా ఇష్టపడుతున్నారు. గత నెల (సెప్టెంబర్ 2024) 15,902 యూనిట్లను విక్రయించడం ద్వారా అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. క్రెటా ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్ల పరంగా ఈ SUV దాని విభాగంలో అగ్రస్థానంలో ఉంది.

4. మారుతి సుజుకి బ్రెజ్జా
మారుతి సుజుకి బ్రెజ్జా భారతదేశంలో భారీగా అమ్ముడవుతోంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యధికంగా ఇష్టపడే మోడల్ ఇదే. గత నెలలో, 15,322 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది నాల్గవ అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. బ్రెజ్జా ప్రారంభ ధర రూ. 8.19 లక్షలు.

5. మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియో గత నెలలో 14,438 యూనిట్లను విక్రయించడం ద్వారా అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారుగా నిలిచింది. ఇది చాలా ఇష్టపడే మిడ్ రేంజ్ ఎస్‌యూవీ. ఈ SUV ధర 13.85 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇది 2.0L , 2.2L డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది.

6. మారుతి సుజుకి బాలెనో
మారుతి సుజుకి బాలెనో గత నెలలో 14,292 యూనిట్లను విక్రయించడం ద్వారా ఆరవ స్థానంలో నిలిచింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. స్థలానికి కూడా కొరత లేదు. బాలెనో ధర రూ. 6.66 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

7. మారుతి సుజుకి ఫ్రాంటెక్స్
13,874 యూనిట్లను విక్రయించడం ద్వారా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏడవ స్థానంలో నిలిచింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. మారుతీకి చెందిన అత్యంత స్టైలిష్ కారు ఇదే. ఈ కారు ధర రూ.7.51 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని ముందు భాగంలో మంచి స్పేస్, ఫీచర్లు ఉన్నాయి.

8. టాటా పంచ్
టాటా మోటార్స్ గత నెలలో 13,711 యూనిట్ల పంచ్‌లను విక్రయించింది.  ఎనిమిదో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దీనిలో CNG,  EV ఆప్షన్లను కూడా ఉన్నాయి. ఈ కారు ధర రూ.6.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

9. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
కుటుంబ వర్గానికి ఇష్టమైన కారు అయిన వ్యాగన్-ఆర్ అమ్మకాల పరంగా మంచి కారు అని నిరూపించుకుంది. గత నెలలో 13,339 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనిలో 1.0L,  1.2L పెట్రోల్ ఇంజన్‌లలో అందుబాటులో ఉంది.

10. మారుతి సుజుకి ఈకో
మారుతి సుజుకి ఈకో తక్కువ బడ్జెట్ 7 సీట్ల కారు. గత నెలలో కంపెనీ 11,908 యూనిట్లను విక్రయించింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పదో కారుగా అవతరించింది. దీని ధర రూ.5.33 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి: