Home /Author M Rama Swamy
Waqf Bill : కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభలో ప్రసంగించారు. బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తిగా చెబుతారని ఆరోపించారు. విపక్షాలు అసత్య ప్రచారం.. బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని మండిపడ్డారు. బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను మరోసారి తప్పుదోవ […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంమఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగింది. సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ […]
KCR : ఈ నెల 27న కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవ మహా సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వారితో మాట్లాడారు. సభకు 10 లక్షల మంది తరలిరానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 […]
Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబద్ధపు ప్రచారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను […]
Xi Jinping : భారత్, చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పరస్పర అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు, డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలన్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య తీవ్ర ఘర్షణతో రెండు దేశాల మధ్య స్తంభించిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్న […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో బిగ్ ఫైట్ మొదలు కానుంది. లక్నోలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ హిట్టర్లతో ఉన్న రెండు జట్లలో పైచేయి సాధించేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. లక్నోకు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ భారీ హిట్టర్లు ఉన్నారు. పంజాబ్‌కు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, […]
Waqf Bill 2024 : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా బావిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రాబోతోంది. బిల్లుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం లభించేలా అధికార పార్టీ పట్టుదలగా ఉంది. పలు కారణాలతో విపక్షాలు విభేదిస్తున్న క్రమంలో బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం ఓటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం మూడులైన్ల విప్ జారీ […]
Ration Cards : ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 30లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఇవాళ మంత్రి ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కుటుంబ రేషన్ కార్డును సైజు […]
Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.. గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి […]
Yogi Adityanath : ప్రధాని మోదీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రానికి సీఎంను అన్నారు. పార్టీ తనను ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం నియమించిందని చెప్పుకొచ్చారు. అందుకే యూపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇక రాజకీయాలు తనకు ఫుల్‌టైమ్ జాబ్ కాదని, వాస్తవానికి తాను ఒక యోగినని ఆయన […]