Home /Author M Rama Swamy
Osmania University : ఉద్యమాలకు ఊపిరి పోసిన ఓయూలో ఇక నుంచి ధర్నాలు, నిరసనలు నిషేధించారు. తాజాగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. ఓయూ శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు. కానీ, విద్యార్థులు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన, ప్రదర్శనలు, ధర్నాలు చేయడం వల్ల పరిపాలన పనులకు ఆటంకం కలుగుతోందని సర్క్యులర్ ఇచ్చారు. యూనివర్సిటీ నిబంధనలు అతిక్రమించడం, ధర్నాలు, ఆందోళనలు, నినాదాలు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించకుండా నిరోధించడం […]
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బయట బూతులు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నామని, కానీ బూతులతోపాటు అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ బూతు పిత అయ్యారని విమర్శించారు. బూతు సినిమాకు పనికొచ్చే స్క్రిప్ట్ లాగా ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉందని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ […]
Vijayasai Reddy : సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టడాలు నిర్మించింది. దీంతో జీవీఎంసీ అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలపై పెద్ద పెద్ద గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ […]
Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓవర్టేక్ చేసే క్రమంలో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
CM Revanth Reddy : స్టేచర్‌పై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మండలిలో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57 లక్షల జీతం తీసుకుంటున్నారని, అసెంబ్లీకి రావటం లేదన్నారు. ప్రభుత్వానికి సూచనలు […]
Guntur : గుంటూరు మేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన పలు కారణాలు వెల్లడిస్తూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మేయర్‌కు ఉండాల్సిన ప్రోటోకాల్ కూడా తొలగించారని, స్టాండింగ్ కమిటీ సమావేశంపై సమాచారం ఇవ్వలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అవమానాలు ఎప్పుడూ తనకు జరగలేదని, ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. తన అనుమతి లేకుండా స్టాండింగ్ […]
Pawan kalyan : ఒక భాషను బలవంతంగా రుద్దడం.. వ్యతిరేకించడం సరికాదని జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో రెండు అంశాలు దోహదపడవని చెప్పారు. ఈ మేరకు పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దాన్ని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. ఎన్ఈపీ-2020 స్వయంగా హిందీని అమలు చేయలేదని పేర్కొన్నారు. హిందీ భాష అమలు […]
Uttar Pradesh : ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. కొన్ని రోజులుగా ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ప్రియుడు ప్రియురాలికి ఈ క్రమంలోనే నగదు, బంగారం కొనిచ్చేశాడు. ఇంతలోనే ఆమె వేరే వ్యక్తితో పరిచయం చేసుకొని ప్రియుడికి నమ్మించి మోసం చేసింది. ఈ ఘటన యూపీలోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. సహజీవనం సమయంలో ఇచ్చిన డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ప్రియుడు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే […]
Srisailam Temple : శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తారు. కాగా, ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే భక్తులను మోసం […]
Kishan Reddy : డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు. శనివారం రైల్వే ఎంజీ అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి ఆయన బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. మహిళ ఉద్యోగులు ఉండేలా చొరవ తీసుకుంటాం.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల […]