Home /Author M Rama Swamy
PM Modi Serious on Congress party regarding Waqf Act: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్‌ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేసిందన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో […]
CLP Meeting with CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం (రేపు) కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ భేటీలో నాలుగు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. భా భారతి పోర్టర్, ఎస్సీ వర్గీకరణ చట్టం, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. […]
AP CM Chandrababu Pays Tribute to Ambedkar: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్య్రోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మేరకు ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని […]
Russia : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో 21 మంది మృతి చెందగా, 80 మంది గాయపడ్డారు. స్థానిక తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ వివరాలను వెల్లడించారు. మట్టల ఆదివారం పండుగ సందర్భంగా స్థానికులు ఒకేచోటకు చేరగా, రెండు క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు. పండుగ సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు అగ్రరాజ్యం అమెరికా […]
Murder in Uttar Pradesh : ల్యాండ్‌కు సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. సదరు మహిళకు మద్య తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యుమునా నదిలో పడేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో అంజలి (28) జీవనం కొనసాగిస్తోంది. తన భర్త మృతిచెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటోంది. కాగా, అంజలి రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర […]
Former Delhi CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆప్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. మనీశ్ గుప్తా అనధికారికంగా ఢిల్లీ సర్కారును నడుపుతున్నారని ఆరోపించారు. మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమైన ఫొటోను అతిశీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారని తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్‌గా మహిళ ఎన్నికైతే […]
Bandi Sanjay : రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నం బియ్యం తామే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన గావ్ చలో కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం ఉదయం కరీంనగర్ మండలంలోని జూబ్లినగర్‌లో పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం […]
Bhu Bharati : ఎన్నికల్లో ధరణి పోర్టర్‌ను బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ధరణితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను దోచుకుని అమ్ముకుందని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూ భారతిని అమలు చేస్తామని చెప్పింది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ భారతిని ప్రవేశపెట్టింది. తెలంగాణలో రేపే భూ భారతి పోర్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. భూ భారతిని […]
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]
AP, Telangana Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో గొడుగులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి […]