Home /Author M Rama Swamy
China-USA : అగ్రరాజ్యం అమెరికా, చైనా ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను డ్రాగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా 145 శాతానికి పెంచగా, డ్రాగన్ నుంచి కూడా అదే రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచింది. చైనాపై విధించిన సుంకాలు 145శాతం.. చైనాపై విధించిన సుంకాలను లెక్కిస్తే 145శాతంగా ఉంటాయని అమెరికా శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వు వెల్లడించింది. […]
TPCC Chief Mahesh Kumar Goud : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్‌లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని […]
Tamil Nadu Minister : తమిళనాడు అటవీశాఖ మంత్రి కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గాయని చిన్మయి, నటి ఖుష్బూతోపాటు పలువురు ప్రముఖులు మంత్రి తీరును ఖండించారు. సొంత పార్టీ నుంచి విమర్శలు రావడంతో డీఎంకే పార్టీ చర్యలు చేపట్టింది. వీడియో నెట్టింటా వైరల్.. ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడిన వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య […]
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా ముందుకుసాగుతోందని చెప్పారు. ఎన్డీయే కూటమి నేతలంగా ప్రతిఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు […]
MP Dharmapuri Arvind : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎంను మార్చాలని అధిష్ఠానం ఆలోచిస్తోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం అయ్యే అన్ని అర్హతలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూళ్లు చేయడం చేతకాదన్నారు. అందుకే అధిష్ఠానం వెనకడుగు వేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూళ్లకు […]
AP CM Chandrababu : త్వరలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని తెలిపారు. అన్నివర్గాల కంటే మిన్నగా బీసీవర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక్కొక్కరికి రూ.15 […]
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు విషయంలో కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, […]
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కారు ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. ప్రజాపాలనలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూమిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందన్నారు. 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చెబుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక రూ.10 వేల కోట్ల కుంభకోణం ఉందన్నారు. కుంభకోణానికి […]
Rain in Telangana : రాష్ట్రంలో పలు చోట్ల గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. హైదరాబాద్పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికోడుతోంది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలు ఊరట లభించింది. నగరంలో మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో వాన పడే అవకాశం ఉంది. నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, […]
Tahawwur Rana : ముంబై పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడైన తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం విమానం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రత కట్టుదిట్టం.. మరోవైపు రాణా రాక సందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుతోపాటు పలు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ కమాండోలు మోహరించారు. రాణాను ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బుల్లెట్ […]