Home /Author Guruvendhar Reddy
TGSRTC MD VC Sajjanar: తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. 2003లో జీఓల 16 ప్రకారం.. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండగ దృష్ట్యా ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతున్నట్లు తెలిపారు. అయితే […]
Deputy Chief Minister Pawan Kalyan launches Palle Panduga: పల్లెలు స్వయం పాలన, ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుడగు వేస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు.. గ్రామ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయ్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లెకు పట్టం గట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ దీనికి కర్త, కర్మ కావడం విశేషం. […]
Pendrive movie launched today: టాలీవుడ్లో నూతన నటీనటులు విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా ‘పెన్ డ్రైవ్’. ఈ సినిమాకు కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కిస్తుండగా.. దసరా పండుగ సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో […]
TGPSC Announced Group 3 Exam: తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ప్రకటించింది. నవంబర్ 17,18వ తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను ఓఎమ్ఆర్ విధానంలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. అయితే తాజాగా, షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందుగానే.. నవంబర్ 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఇప్పటికే శాంపిల్ ఓఎమ్ఆర్ ఆన్సర్ షీటును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-3 పరీక్షల్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. తొలుత […]
Former Bapatla MP Nandigam Suresh illness: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. భుజంతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ షుగర్, బీపీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో భాగంగానే బీపీ, ఛాతిలో నొప్పి వస్తున్నట్లు జిల్లా జైలు అధికారులకు తెలపగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ […]
Nobel Peace Prize 2024 Awarded to Japan: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. 2024 ఏడాదికి గానూ జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ మేరకు స్టాక్ఘోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది […]
Noel Tata Succeeds Ratan as Chairman of Tata Trusts: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నోయెల్ టాటా.. టాటా స్టీల్ అండ్ వాచ్ కంపెనీ టైటాన్ వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నాడు. అలాగే శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన నేపథ్యంలో ఆయన వారసుడిగా నోయల్ టాటాను ఎంపిక చేస్తూ బోర్డు సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. రతన్ […]
Rajinikanth Vettaiyan box office collections: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’. ఈ సినిమాను టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అయింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అలాగే మంజు వారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రోహిణి అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ నటించారు. ఈ […]
Rafael Nadal announces retirement from tennis: స్పెయిన్ దిగ్గజ ఆటగాడు, కింగ్ ఆఫ్ క్లే రఫెల్ నాదల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ చివరి సిరీస్ అని ప్రకటించాడు. 1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించిన రఫెల్ నాదల్.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశం పొందాడు. ఆ తర్వాత 2008లో నంబర్ వన్ ర్యాంక్ సాధించగా.. దాదాపు ఐదేళ్లు […]
Donations flood Kamala Harris’ campaign: అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ కమలాహారిస్ బరిలో నిల్చున్నారు. ఈ ఏడాది జూలైలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ తెరపైకి రాగా.. అప్పటినుంచి ఆమెకు మద్దతు పెరుగుతూ వస్తోంది. కమలాహారిస్ అభ్యర్థిత్వం ప్రకటించినప్పటినుంచి ఆమె ప్రచారానికి 1 బిలియన్ డాలర్లకుపైగా విరాళాలు సేకరించారు. ప్రస్తుతం అమెరికా వర్గాల్లో […]