TGSRTC: స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం.. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో మార్పు లేదు
TGSRTC MD VC Sajjanar: తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. 2003లో జీఓల 16 ప్రకారం.. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండగ దృష్ట్యా ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి సిటీ బస్సులను రాష్ట్రంలోని పలు జిల్లాలకు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ స్పెషల్ బస్సులు తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేనందున కనీసం డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ల ధరల్లో మార్పు చేసినట్లు చెప్పారు.
2003 జీఓ 16 ద్వారా టికెట్ ధరలను పండగ సమయాల్లో 1.5శాతం సవరించుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఇక, మహాలక్ష్మి పథకం ద్వారా 25శాతం ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వివరించారు.