Home /Author Guruvendhar Reddy
Parliament Winter Session Postponed: పార్లమెంట్ సమావేశాలల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం వాయిదాపడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్య సభ కార్యక్రలాపాలు ఉదయం 11 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష ఎంపీల ఆదోళనలతో ఉభయసభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. మరో వైపు సభా ప్రారంభం ముందు వాయిదా తర్వాత కూడా పార్లమెంట్ […]
AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా, ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు […]
BRS Party Leaders Protest Telangana Bhavan about Change of Telangana talli statue: తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ విగ్రహమని ఆరోపించారు. […]
Heavy Rain Alert To AP For The Next Three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్రేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలోని […]
United Nations Security Council: ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం అమెరికా నుంచి అతి చిన్న దేశం వరకూ దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఎలాంటి ఫలితాలనూ ఇవ్వటం లేదనే వాదన మరోసారి చర్చగా మారుతోంది. దాదాపు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో నాడు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాలని చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, బ్రిటన్, అమెరికా దేశాలు వాటికవే నిర్ణయించుకున్నాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 స్వతంత్ర దేశాలు మాత్రమే ఉండేవి. కానీ, […]
World Test Championship Points Table: డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఆసక్తికరంగా మారింది. అడిలైడ్ టెస్ట్ విజయంతో ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆసీస్ ఆనందాన్ని గంటల వ్యవధిలోనే ఆవిరి చేస్తూ.. ఫస్ట్ ర్యాంక్‌ను దక్షిణాఫ్రికా తన్నుకుపోయింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకోవటం ద్వారా తన పర్సంటేజీని (63.33 శాతం) మెరుగుపరుచుకుని టాప్-1లోకి చేరింది. ఇక ఆస్ట్రేలియా 60.71, భారత్ 57.29 శాతాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో […]
Threatening Calls To Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని పేషీ అధికారులు.. పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై హోంశాఖ మంత్రి అనిత.. డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ.. […]
Sanjay Malhotra appointed as new RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ఈ నెల 10న ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021 సంవత్సరంలో ముగియగా, కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. గడువు కూడా నేటితో ముగియనుండడంతో కొత్త గవర్నర్‌ను […]
Former Karnataka CM SM Krishna Passes Away: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో బెంగుళూరులోని సదాశివనగర్‌లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ.. 1989 నుంచి 1993 మధ్య కాలంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత […]
TGPSC Group 2 Hall Ticket Download: గ్రూప్-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్ష కోసం అభ్యర్థులు సోమవారం నుంచి ఈ నెల 14 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. రోజుకు రెండు సెషన్లుగా.. . 15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం […]