Home /Author anantharao b
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుండి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చంది. ఇక్కడ యువత ఫ్లేవర్ కండోమ్‌లకు అలవాటు పడుతున్నారు, యువత పెద్ద ఎత్తున ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లను కొనుగోలు చేసి వాటితో మత్తులో మునుగుతున్నారు
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించిన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన కోవిడ్ -19కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ అరికట్టేందుకు మార్కెట్లోకి కొన్ని వ్యాక్సిన్లు వచ్చాయి. వాటిలో బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ర్టాజెనెకా ఒకటి.
కర్నాటక ఎమ్మెల్యే హెచ్డి రేవన్న చేతిలో కిడ్నాప్‌కు గురైన మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో రేవన్న, అతని కుమారుడు ప్రజ్వల్ కు కొత్త సమస్యలు తలెత్తాయి. హెచ్డి రేవన్నకు చెందిన ఫామ్‌హౌస్‌లో గృహిణిగా పనిచేసిన మహిళ వాంగ్మూలాన్ని అనుసరించి కిడ్నాప్ కేసు ఎఫ్ఐఆర్లో రేప్ అభియోగాలు జోడించబడ్డాయి.
వైసీపీ ఓటమి..కూటమి విజయం ఖాయమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వారాహి విజయ భేరి సభలో సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని..అంతా కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.
భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్ చేసి ప్రస్తుతం లేనిపోని ఇబ్బందులు పడుతోంది. సిబ్బంది కొరతతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు చివరి నిమిషంలోవిమానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎయిర్ ఇండియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సారి అధికారంలోకి వస్తే.. ఏడాదికి ఒక ప్రదానిని తీసుకువస్తారని అన్నారు. ఐదు సంవత్సారాలలో ఐదు మంది ప్రధానలు మారుతారు . అంటే దేశ ప్రగతిని అధోగతి పాలు చేయబోతున్నారని ప్రధాని విమర్శించారు. వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సామ్ పిట్రోడాతో తలనొప్పులు తగ్గేట్లు లేవు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా ఇటీవలే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వపన్నును అమల్లోకి తెస్తామని ప్రకటించి పెద్ద దుమారం రేపారు. దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంది.
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో.. ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.